ప్రైవేటు వీడియోలు బయటపెడతానని బెదిరించి.. రూ. 6.71 లక్షలు వసూలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:15 AM
స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి.. తన ప్రైవేటు వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి రూ.6.71 లక్షలు వసూలు చేశాడంటూ ఓ యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
స్నాప్‌చాట్‌లో పరిచయమైన వ్యక్తిపై యువతి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి.. తన ప్రైవేటు వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి రూ.6.71 లక్షలు వసూలు చేశాడంటూ ఓ యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్, జేఎన్టీయూ సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటున్న ఓ యువతి(26) రీసెర్చ్ స్కాలర్. ఆమెకు సెప్టెంబరు 6న స్నాప్‌చాట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తన పేరు కృతిన్ రెడ్డి అని, హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తుంటానని చెప్పాడు. చాటింగ్ ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగింది.
ఈ క్రమంలో కృతిన్ రెడ్డి కోరిన మేరకు బాధిత యువతి తన నగ్న ఫొటోలు, వీడియోలను పంపించింది. అనంతరం ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని కృతిన్రెడ్డి బెదిరింపులు ప్రారంభించాడు. బాధిత యువతి పేరిట ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ల్లో ఖాతాలు తెరిచి ఆ యువతి ఫొటోలను వాటిల్లో పోస్టు చేసి వేధించడం మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వీడియోలను కూడా బయటపెడతానని బెదిరించాడు. కృతిన్ రెడ్డి బెదిరింపులకు భయపడి ఆ యువతి విడతలవారీగా రూ.6.71 లక్షలు చెల్లించింది. అయినా వేధింపులు ఆపని కృతిన్ రెడ్డి అక్టోబరు 10న మరో రూ.1.50లక్షలు డిమాండ్ చేశాడు. వేధింపులు భరించలేక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
రెస్టారెంట్లో కలుషిత ఆహారం తిని యువకుడి మృతి.. 19 మందికి అస్వస్థత
మొదటి కాన్పులో కవలలు పుట్టినా.. రెండో కాన్పులో ప్రసూతి సెలవులకు అర్హులే
బరువు తగ్గుతారంటూ నాసిరకం మందులు!
Read Latest AP News And Telangana News And International