రెస్టారెంట్లో కలుషిత ఆహారం తిని యువకుడి మృతి.. 19 మందికి అస్వస్థత
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:05 AM
ఓ రెస్టారెంట్లో కలుషిత ఆహారం తిని ఒకరు మరణించగా పలువురు అస్వస్థతకు గురయ్యా రు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఘటన
నర్సాపూర్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఓ రెస్టారెంట్లో కలుషిత ఆహారం తిని ఒకరు మరణించగా పలువురు అస్వస్థతకు గురయ్యా రు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నర్సాపూర్-మెదక్ జాతీయ రహదారిపై పది రోజుల క్రితమే వన్ ప్యాలెస్ అనే రెస్టారెంట్ ప్రారంభించారు. కొత్త హోట ల్.. పైగా ఆకర్షణీయంగా ఉండటంతో ఆహారం బాగుంటుందని స్థానికులతో పాటు హైవేపై వెళ్లే వారూ ఇక్కడికి వస్తున్నారు. సోమవారం రాత్రి కూడా స్థానిక యువకులతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు రెస్టారెంట్లో భోజనం చేశారు. ఇక్కడ తిన్న వారిలో స్థానికుల్లో ముగ్గు రు మంగళవారం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైర ల్ అయింది.
తమ తప్పేమీ లేదని, ఆ రోజు ఎందరో తిన్నారంటూ రెస్టారెంట్ నిర్వాహకులు కొట్టిపారేశారు. అయితే ఆ రోజు రాత్రి భోజనం చేసిన వారిలో 20 మందికి పైగా వాంతులు, విరేచనాలతో నర్సాపూర్ ప్రభు త్వ ఆస్పత్రికి రావడంతో అసలు విషయం బయటపడింది. అస్వస్థతకు గురైన వారిలో సాయిరాం ముదిరాజ్ (19) అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటం తో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిరాం మృతిచెందాడు. మిగతా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, బుధవారం నర్సాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. లైసెన్సు లేకుండా నడుపుతున్న వన్ ప్యాలెస్ రెస్టారెంట్ ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బరువు తగ్గుతారంటూ నాసిరకం మందులు!
Read Latest AP News And Telangana News And International