గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:45 AM
‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్‌కు అనుగుణంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2026’లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు.
‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్యసాధనలో భాగస్వాములవ్వండి
‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్-26’లో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్‌కు అనుగుణంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2026’లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి... ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్ - 2026’కు ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్థి, నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం, వ్యాపారాలకు అనుకూల వాతావరణం కల్పించడంపై దృష్టి సారించామన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సె్‌సతో పాటు ఏఐ, ఏరోస్పేస్, రక్షణ రంగం, అధునాతన తయారీ లాంటి రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలను విస్తరించేందుకు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
2 లక్షల మందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ
తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత
Read Latest AP News And Telangana News And International