ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:33 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదోరోజు దుర్గమ్మ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
విజయవాడ, అక్టోబర్ 15: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదోరోజు(గురువారం) దుర్గమ్మ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దసరా వేడుకల్లో అమ్మవారు ఐదోరోజున శ్రీలలితా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీచక్ర అధిష్ఠాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని, అత్యున్నత స్థితి లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రకృతిశక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాంపభౌతికశకే లలితా దేవి.
పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే ఐదు తన్మాత్రల ద్వారా ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉంటాయి. ఇన్నింటిలోనూ ఉండే శక్తి మరొకటి ఉంది. ఆ శక్తినే లలితగా భావన చేసే సంప్రదాయం భారతీయులది. సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా, చిరుమందహాసంతో చెరుగడను చేతపట్టుకుని పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి ఉపాసన వ్యక్తిలో సౌమ్యత్వాన్ని పెంచుతుందని భక్తుల విశ్వాసం.
దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. ఉదయాన్నే వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందినట్లు తెలిపారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. నేషనల్ సరస్ ఈవెంట్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడం సంతోషంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
ఇవి కూడా చదవండి...
మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
రావణ్కు 28 వరకు రిమాండ్ పొడిగింపు
Read Latest AP News And Telugu News