వీఆర్ఏల సమ్మెకు తాత్కాలిక బ్రేక్!
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:59 AM
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో గత 29 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఏపీ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర వైస్చైర్మన్ నల్లిపోగు నాగేశం ప్రకటించారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో విధుల్లో చేరాలన్న జేఏసీ
విజయవాడ (గాంధీనగర్) అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో గత 29 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఏపీ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర వైస్చైర్మన్ నల్లిపోగు నాగేశం ప్రకటించారు. స్థానిక దాసరిభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలందరూ తక్షణమే విధుల్లోకి చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుందామని పేర్కొన్నారు. వీఆర్ఏలందరూ నిరుపేద వర్గాలకు చెందినవారని, ఎంతో అనుభవం కలగిన సీఎం చంద్రబాబు తమ గోడు వినకపోతే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. 29 రోజుల సమ్మె అనంతరం ఎలాంటి ఫలితాల లేకుండానే సమ్మె విరమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..