హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..
ABN , Publish Date - Oct 14 , 2026 | 09:48 PM
హోర్ముజ్ జలసంధిలో నావల్ మైన్ను ఢీకొనడంతో కార్గో నౌక మునిగిపోయిందని ఇరాన్ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఒక ప్రకటన విడుదల చేసింది. యుద్ధం సమయంలో మైన్ను ఢీకొని ఒక నౌక మునిగిపోవడం ఇదే మొదటిసారని ఐఆర్జీసీ పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో నావల్ మైన్ను ఢీకొనడంతో కార్గో నౌక మునిగిపోయిందని ఇరాన్ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఒక ప్రకటన విడుదల చేసింది. యుద్ధం సమయంలో మైన్ను ఢీకొని ఒక నౌక మునిగిపోవడం ఇదే మొదటిసారని ఐఆర్జీసీ పేర్కొంది. మునిగిపోయిన ఆ నౌక అక్రమ, ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తోందని తెలిపింది. అయితే, ఆ నౌకను గురించిన వివరాలు తెలియరాలేదని, మైన్ను ఢీకొన్న తర్వాత నౌక నుంచి దట్టమైన పొగలు వచ్చాయని, తర్వాత నౌక ఒక వైపు ఒరిగి మునిగిపోయిందని వివరించింది.
అలాగే, అందులో ఉన్న సిబ్బంది గురించి కూడా వివరాలు తెలియరాలేదని పేర్కొంది. మొత్తం 2500 కంటెయినర్లను నౌక రవాణా చేస్తోందని ఐఆర్జీసీ పేర్కొన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లకూదని నౌకలకు ఇరాన్ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. హోర్ముజ్ ద్వారా ఒమన్ తీరానికి వెళ్లే నౌకలకు అమెరికా మిలిటరీ రక్షణ కల్పిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
శ్వేతసౌధం కొత్త ప్రెస్ సెక్రటరీ తడబాటు.. ఊహించని మిస్టేక్..
పాకిస్థాన్లో 22 శాతం నీటి కొరత.. సొంత తప్పిదాలే కారణమా?