Share News

పాకిస్థాన్‌లో 22 శాతం నీటి కొరత.. సొంత తప్పిదాలే కారణమా?

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:09 PM

పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో 22 శాతం సాగు నీటి కొరత ఉంటుందని (ఐఆర్ఎస్ఏ) వెల్లడించింది. దీంతో గోధుమ, బార్లీ, శనగ పంటల సాగులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.

పాకిస్థాన్‌లో 22 శాతం నీటి కొరత.. సొంత తప్పిదాలే కారణమా?
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో ఈ రబీ సీజన్‌లో 22 శాతం సాగు నీటి కొరత ఉంటుందని పాకిస్థాన్ ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ఐఆర్ఎస్ఏ) వెల్లడించింది. దీంతో గోధుమ, బార్లీ, శనగ పంటల సాగులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. మరోవైపు పాకిస్థాన్ నీటి కొరతకు భారత్ కారణమంటూ అక్కడి ప్రభుత్వం తరచూ ఆరోపిస్తున్న వేళ.. ఈ కొరతకు కారణం పాకిస్థాన్ సొంత చర్యలేనని ఆ దేశ అధికారిక సంస్థ ఐఆర్ఎస్ఏ పేర్కొన్నట్టు తెలుస్తోంది.


పాకిస్థాన్‌తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో 2025లో ఈ ఒప్పందం రద్దయింది. అప్పటి నుంచి తమ దేశంలో నీటి కొరతను చూపిస్తూ భారత్‌ను పాక్ నిందిస్తోంది. అయితే ఈ నీటి కొరతకు కారణం పాకిస్థానే అని ఐఆర్ఎస్ఏ వెల్లడించిందని ఆ దేశ పత్రిక కథనం ప్రచురించింది. పలు హైడ్రోప్రాజెక్ట్‌ల నిర్మాణంలో పాకిస్థాన్ జాప్యం చేయడం దీనికి ప్రధాన కారణమని ఆ ప్రభుత్వ సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే నదుల్లో ప్రవాహం తగ్గటం, దేశంలో జలశయాలు తక్కువగా ఉండటం లాంటివి ఇతర కారణాలుగా చూపిందని ఆ పత్రిక పేర్కొంది.


ఈ వార్తలూ చదవండి

పాక్‌లో లష్కర్ టాప్ కమాండర్ హత్య?

ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌లో సీక్రెట్ మైక్.. ఓపెన్ఏఐ ఇంజినీర్ అరెస్ట్

Updated Date - Oct 14 , 2026 | 12:17 PM