Share News

సిట్‌ కస్టడీకి కారుమూరి సునీల్‌

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:14 AM

మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్‌ను కోర్టు రెండు రోజుల సిట్‌ కస్టడీకి అప్పగించింది.

సిట్‌ కస్టడీకి కారుమూరి సునీల్‌

విజయవాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్‌ను కోర్టు రెండు రోజుల సిట్‌ కస్టడీకి అప్పగించింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. సునీల్‌ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదప్రతివాదనలు ముగియడంతో బుధ, గురువారాలు సునీల్‌ను కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

టి.ఈశ్వర్‌కుమార్‌రెడ్డికి రిమాండ్ పొడిగింపు:

మద్యం కుంభకోణంలో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న టి.ఈశ్వర్‌కుమార్‌రెడ్డికి ఈనెల 27వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. అతడి రిమాండ్‌ గడువు మంగళవారంతో ముగియడంతో జైలు అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. దీంతో రిమాండ్‌ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 06:16 AM