కొత్త డీఎస్సీలో 290 పోస్టులు
ABN , Publish Date - Oct 14 , 2026 | 02:48 AM
ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో భాగంగా తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టిన సీఎం చంద్రబాబునాయుడు తన వాగ్దానాన్ని నిలుపుకొనే క్రమంలో ఈ ఏడాది కొత్త డీఎస్సీ ప్రకటించారు.
వాటిలో 169 ఎస్‌జీటీలు
మార్కాపురం జిల్లాకే ఎక్కువ
నోటిఫికేషన్ విడుదల
ఒంగోలు విద్య, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో భాగంగా తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టిన సీఎం చంద్రబాబునాయుడు తన వాగ్దానాన్ని నిలుపుకొనే క్రమంలో ఈ ఏడాది కొత్త డీఎస్సీ ప్రకటించారు. గత ఏడాది మెగా డీఎస్సీ నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ప్రస్తుత డీఎస్సీకి ఎన్ని పోస్టులు ప్రకటించాలో విద్యాశాఖ ఉన్నతాధికారులు లెక్కలు తేల్చా రు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 26 జిల్లాలకు ఖాళీ పోస్టులను వెల్లడించారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఉమ్మడిగా మొత్తం 48 మండలాల ప్రాతిపదికన పోస్టులు ప్రకటించారు. వాటిలో రెండు జిల్లాలకు 290 టీచర్ పోస్టులు ఉన్నాయి. అందులో 169 ఎస్‌జీటీలు. మొత్తం పోస్టుల్లో సింహభాగం ప్రస్తుతం మార్కాపురం జిల్లాలోని పాఠశాలల్లో భర్తీ చేయనున్నారు.