గిన్నిస్ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత
ABN , Publish Date - Oct 14 , 2026 | 02:06 AM
ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ఐదు రోజుల సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం మంగళవారం రాత్రి ఘనంగా ముగిసింది.ఇందులో భాగంగా ఎస్వీయూ స్టేడియంలో 2వేల మంది కళాకారులతో నిర్వహించిన 75 గంటలపాటు డప్పు వాయిద్య ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ఐదు రోజుల సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం మంగళవారం రాత్రి ఘనంగా ముగిసింది.ఇందులో భాగంగా ఎస్వీయూ స్టేడియంలో 2వేల మంది కళాకారులతో నిర్వహించిన 75 గంటలపాటు డప్పు వాయిద్య ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.ముగింపు కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈవో పవన్ సోలంకి హాజరై రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని నిర్వాహకులకు అందజేశారు.ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నాయకుడు బాబూ మోహన్ మాట్లాడుతూ... త్వరలో జరగనున్న స్థానిక, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి డప్పు బజాయిస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు.ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పణతల సురేష్,ప్రధాన కార్యదర్శులు ఉదయ్, బసవరాజు,అధికార ప్రతినిధి గవ్వల అశోక్, బీజేపీ అధికార ప్రతినిఽఽధులు జల్లి మధుసూదన్, భానుప్రకాష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్,బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, భవానీశంకర్, గుండాల గోపీనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.