Share News

శ్వేతసౌధం కొత్త ప్రెస్ సెక్రటరీ తడబాటు.. ఊహించని మిస్టేక్..

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:40 PM

శ్వేత సౌధం నూతన ప్రెస్ సెక్రటరీగా నియమితులైన కేటీ జకారియా తన తొలి పత్రికా సమావేశంలో ఊహించని పొరపాటు చేశారు.

శ్వేతసౌధం కొత్త ప్రెస్ సెక్రటరీ తడబాటు.. ఊహించని మిస్టేక్..
White House Press Secretary Katie Zachariah

ఇంటర్నెట్ డెస్క్: శ్వేత సౌధం నూతన ప్రెస్ సెక్రటరీగా నియమితులైన కేటీ జకారియా తన తొలి పత్రికా సమావేశంలో తడబడి ఊహించని పొరపాటు చేశారు. తన భర్త గురించి ప్రస్తావిస్తూ మధ్యలో పొరపాటున యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరెత్తి ఇబ్బందిపడ్డారు. ఆ వెంటనే పత్రికా సమావేశాన్ని కట్టిపెట్టి వెళ్లిపోయారు.

కేటీ జకారియా ఇటీవల శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. మంగళవారం పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. నలుగురు బిడ్డలకు తల్లైన ఆమె తన ఉద్యోగబాధ్యతలు, కుటుంబబాధ్యతల మధ్య సమతౌల్యం సాధించడం గురించి కూడా చెప్పారు. ఉద్యోగబాధ్యతల్లో బిజీగా ఉన్న తనకు కుటుంబం విషయంలో భర్త నుంచి లభిస్తున్న సహకారం వెలకట్టలేనిదని అన్నారు. అయితే, కన్న బిడ్డలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోవడంతో తనని తాను క్షమించుకోలేకపోతున్నానని కూడా చెప్పారు.


ఆ తరువాత భర్త గురించి మాట్లాడుతూ పొరపాటున ట్రంప్ పేరు పలికి నాలిక కరుచుకున్నారు. ఆ తరువాత వెంటనే తేరుకున్న ఆమె భలే పొరపాటు జరిగిందని సరదాగా కామెంట్ చేశారు. ఆ తరువాత కొన్ని క్షణాలకే పత్రికా సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. దీంతో, పావు గంటలోపే సమావేశం ముగిసింది. ఈ సమావేశంపై స్థానిక పత్రికలు ఘాటు వ్యాఖ్యలు చేశాయి. ఆమె ప్రసంగం యాంత్రికంగా అనిపించిందని కొన్ని పత్రికలు వ్యాఖ్యానించాయి. ఎంత రచ్చ జరగాలో అంత జరిగిందని కొన్ని రాసుకొచ్చాయి.

జకారియా నియామకం ఇప్పటికే వాషింగ్టన్‌లో చర్చనీయాంశంగా మారింది. తాను కాలిఫోర్నియాలో లాయర్‌ను అని ఆమె గతంలో తెలిపారు. కానీ రాష్ట్ర బార్ వెబ్‌సైట్‌లో ఆమె పేరు కనిపించకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మీరు బార్ ఎగ్జామ్‌ ఎక్కడ రాశారని ఇటీవల మీడియా ప్రశ్నించగా ‘చైనాలో ..’ అని ఆమె వెటకారంగా సమాధానం ఇచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

పాకిస్థాన్‌లో 22 శాతం నీటి కొరత.. సొంత తప్పిదాలే కారణమా?

బాలికపై లైంగిక వేధింపులు.. రోబోను సీజ్ చేసిన పోలీసులు

Updated Date - Oct 14 , 2026 | 12:56 PM