Share News

అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం.. త్రుటిలో తప్పించుకున్న నలుగురు..

ABN , Publish Date - Oct 15 , 2026 | 08:33 AM

అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. నలుగురు ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పరిధిలో కలకలం రేపింది.

అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం.. త్రుటిలో తప్పించుకున్న నలుగురు..
Medchal Car Fire Accident

మేడ్చల్ జిల్లా: అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. నలుగురు ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పరిధిలో కలకలం రేపింది.


వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కు చెందిన నలుగురు వ్యక్తులు రెనాల్ట్ పెట్రోల్ కారులో ప్రయాణిస్తున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధి అన్నోజిగూడ ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే వారి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. మంటలు చెలరేగడాన్ని గుర్తించిన వారంతా వెంటనే కారు నుంచి దిగిపోయారు. దీంతో నలుగురికి పెను ప్రమాదం తప్పింది.


బాధితులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. మరోవైపు, పోలీసులూ అక్కడికి చేరుకుని పరిశీలించారు. కాగా, కారు మంటల్లో చిక్కుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, మరేదైనా కారణమా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

‘డబుల్‌ డ్యూటీ’కి సెలవులు ఇవ్వొద్దు: ఆర్టీసీ

డిస్కంలకు హైకోర్టులో ఊరట

Updated Date - Oct 15 , 2026 | 08:38 AM