Share News

నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్.. యువకుడి మృతి

ABN , Publish Date - Oct 15 , 2026 | 10:30 AM

మెదక్ జిల్లా నర్సాపూర్‌ ఫుడ్ పాయిజన్ ఘటనలో సాయిరామ్ అనే యువకుడు మృతిచెందాడు. స్థానికంగా ఉన్న వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో ఇటీవల మండి బిర్యానీ తిని అస్వస్థతకు గురైన యువకుడు చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్.. యువకుడి మృతి
Food Poisoning

మెదక్ జిల్లా: నర్సాపూర్‌ ఫుడ్ పాయిజన్ ఘటనలో సాయిరామ్ అనే యువకుడు మృతిచెందాడు. స్థానికంగా ఉన్న వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో ఇటీవల మండి బిర్యానీ తిని అస్వస్థతకు గురైన అతను చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రెస్టారెంట్‌లో బిర్యానీ తిని మొత్తం 19 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో వారిని హుటాహుటిన నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


అయితే, బాధితుల్లో సాయిరామ్(19) పరిస్థితి విషమంగా మారింది. దీంతో మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ యువకుడు తుదిశ్వాస విడిచాడు. మరోవైపు, నర్సాపూర్ ఏరియా ఆస్పత్రిలో 18 మందికి చికిత్స కొనసాగుతోంది. యువకుడి మృతిపై బాధిత కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సాయిరామ్ మృతికి కారణమైన వారిని కఠిన శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆహార నమూనాలను పరీక్షించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, వారి ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

డిస్కంలకు హైకోర్టులో ఊరట

అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం.. త్రుటిలో తప్పించుకున్న నలుగురు..

Updated Date - Oct 15 , 2026 | 10:44 AM