Share News

ఏబీఎన్ 17వ వార్షికోత్సవం.. సీఎం చంద్రబాబు విషెస్

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:22 AM

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి 17వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏబీఎన్ 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఏబీఎన్ 17వ వార్షికోత్సవం.. సీఎం చంద్రబాబు విషెస్
CM Chandrababu Naidu

అమరావతి, అక్టోబర్ 15: ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి 17వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ రాజకీయ నేతలు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు. ఏబీఎన్ 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం రాజీలేని నిబద్ధతతో ఏబీఎన్ కృషి చేస్తోందన్నారు.


చంద్రబాబు పోస్ట్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ 17వ వార్షికోత్సవం, ఆంధ్రజ్యోతి పత్రిక 24వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ, జర్నలిస్టులకు, ఉద్యోగులకు, సిబ్బందికి సీఎం చంద్రబాబు నాయుడు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. పాత్రికేయ విలువలకు కట్టుబడి, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం రాజీలేని నిబద్ధతతో కృషి చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల ప్రస్థానం మరింత వెలుగొందాలని ఆకాంక్షించారు. పాఠకులకు, వీక్షకులకు, ప్రజలకు మరింత చేరువ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

అబ్దుల్ కలాం జయంతి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాళులు

17 వసంతాలు పూర్తి చేసుకున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’.. మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2026 | 11:45 AM