Share News

గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసు.. సిట్‌ ఎదుట ఏ4 సురేశ్ లొంగుబాటు

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:08 PM

గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న సురేశ్.. సిట్‌ కార్యాలయంలో లొంగిపోయాడు.

గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసు.. సిట్‌ ఎదుట ఏ4 సురేశ్ లొంగుబాటు
A4 Suresh Surrenders Before SIT

విజయవాడ, సెప్టెంబర్ 17(ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న సురేశ్.. సిట్‌ కార్యాలయంలో లొంగిపోయాడు. సాయికృష్ణ మృతి అనంతరం చోటుచేసుకున్న పరిణామాల్లో సురేశ్ పాత్రపై ఇప్పటికే పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాయికృష్ణ మృతదేహం మాయంచేసిన వ్యవహారంలో అతడు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు రావడంతో.. ఆ దిశగా సిట్‌ అధికారులు విచారణ చేపట్టారు.


మరోవైపు.. సీఐ నాగరాజుకు సురేశ్ సన్నిహితుడిగానూ ఉన్నట్లు సమాచారం. సాయికృష్ణ కుటుంబ సభ్యులతో సెటిల్‌మెంట్‌ చేసేందుకూ సురేశ్ యత్నించినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో.. ఆ వ్యవహారంపైనా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కస్టోడియల్‌ డెత్‌కు దారితీసిన పరిస్థితులు, అనంతరం మృతదేహం మాయం కావడానికి కారణాలు, ఈ పరిణామాల్లో సురేశ్ పాత్ర ఎంతమేరకు ఉందనే అంశాలపై సిట్‌ అధికారులు దృష్టి సారించారు. విచారణ అనంతర మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.


ఇవీ చదవండి:

ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ

‘సెమీకాన్ ఇండియా-2026’కు ప్రధాని మోదీ శ్రీకారం

Updated Date - Sep 17 , 2026 | 04:31 PM