ఎన్టీఆర్ జిల్లాలో ఫేక్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హల్‌చల్.. హోటల్ యజమానికి బెదిరింపులు
ABN , Publish Date - Aug 24 , 2026 | 07:59 AM
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో ఓ హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పేరుతో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరింపులకు దిగాడు.
ఎన్టీఆర్ జిల్లా, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో ఓ హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పేరుతో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరింపులకు దిగాడు. డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు.
ఆధునిక టెక్నాలజీ సురక్షా 360 సీసీ టీవీ కెమెరాల ద్వారా సదరు వ్యక్తి కారును పోలీసులు గుర్తించారు. ఆ కారును స్వాధీనం చేసుకున్న సమయంలో తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్‌ను గుర్తించారు. అది సిగరెట్ లైటర్ మాత్రమే అని, నిజమైన తుపాకీ కాదని పోలీసులు నిర్ధారించారు. ఫేక్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కుంభా గోవిందును పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
మోదీ నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం కొత్త శకంలోకి: పవన్ కల్యాణ్
అల్పపీడన ప్రభావం.. ఏపీలో వర్షాలు
వెలిగొండ ప్రాజెక్ట్.. ఆఖరి లబ్ధిదారుడి వరకూ పరిహారం అందిస్తాం: మంత్రి డీజీవీ స్వామి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News