తల్లి, చెల్లిని అగౌరవపరుస్తారా? సాక్షి కథనాలపై సీఎం చంద్రబాబు ఫైర్
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:12 PM
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి పిలుపు కోసం వచ్చిన సందర్భంపై సాక్షిలో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబర్ 18: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి పిలుపు కోసం వచ్చిన సందర్భంపై సాక్షిలో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వం లేకుండా తల్లి, చెల్లిని అగౌరవపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. తల్లి, చెల్లిని అగౌరవపరిచేవారు రాజకీయ ముసుగులో ఉన్నారని వ్యాఖ్యానించారు. సొంత చెల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచేవారు రాజకీయాలకు అనర్హులన్నారు. ఈ విషయంపై ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈరోజు (బుధవారం) టీడీపీ శ్రేణులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ, 2వ దశ పట్టణ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. తదుపరి ఎన్నికల్లోనూ గెలుపే ధ్యేయంగా కృషి చేయాలని సూచించారు. కూటమి సత్తా చాటేందుకు స్థానిక ఎన్నికలు సదావకాశంగా చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే ఇప్పుడు గణనీయంగా పెరగాలన్నారు.
కూటమి పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండాలని.. ప్రతి ఎన్నికలో విజయం కూటమిదే కావాలని ఆకాంక్షించారు. ఏ ఒక్క వార్డులో ఓడినా ఎందుకు ఓడిపోయామో విశ్లేషిస్తామని తెలిపారు. గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఐక్యతను విశ్లేషించి అందుకనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ‘మన ఐక్యత శాశ్వతం కావాలి’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
నందికొట్కూరు ఎంపీపీ ఎన్నికలపై ఉత్కంఠ
ఏపీ సెమీకండక్టర్ పాలసీకి ఆమోదం.. ఫ్యాబ్‌లకు 80 శాతం పెట్టుబడి రాయితీ
Read Latest AP News And Telugu News