హాస్టళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు.. కుళ్లిన కూరగాయలు, బొద్దింకల గుర్తింపు
ABN , Publish Date - Nov 18 , 2026 | 03:56 PM
హైదరాబాద్‌లోని పలు హాస్టళ్లు, రెస్టారెంట్లలో టీజీ సేఫ్ ఫుడ్ వింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.
హైదరాబాద్, నవంబర్ 18: ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన ఫుడ్ సెంటర్లలో అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో టీజీ సేఫ్ ఫుడ్ వింగ్ అధికారులు తరచుగా పెద్దపెద్ద రెస్టారెంట్లు, ఫుడ్ సెంటర్లలో దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా నగరంలోని పలు హాస్టళ్లు, రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు విస్తుపోయే అంశాలు టీజీ సేఫ్ దృష్టికి వచ్చాయి.
ఆహారాన్ని తయారుచేసే కిచెన్లలో అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించారు. కుళ్లిపోయిన కూరగాయలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. కిచెన్లలో బొద్దింకలు, ఇతర కీటకాలు కూడా కనిపించాయన్నారు. లేబుల్స్ లేకుండానే చపాతీ ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. అలాగే గడువు ముగిసిన సాస్, వెనిగర్‌ను కూడా అధికారులు సీజ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన కొన్ని సెంటర్ల మూసివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరికొన్ని సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఇంకొన్ని సెంటర్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులను టీజీ సేఫ్ ఫుడ్ వింగ్ అధికారులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
షీ టీమ్స్ పేరుతో మాజీ ప్రియుడికి ఫేక్ నోటీసు.. హైదరాబాద్‌లో యువతి నిర్వాకం
నిమ్స్ టెండర్లపై ఏసీబీ విచారణ.. కోవిడ్ బెడ్ల కేటాయింపులపై లక్ష్మీ భాస్కర్ వాంగ్మూలం
Read Latest Telangana News And Telugu News