Share News

షీ టీమ్స్ పేరుతో మాజీ ప్రియుడికి ఫేక్ నోటీసు.. హైదరాబాద్‌లో యువతి నిర్వాకం

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:47 PM

హైదరాబాద్‌లో మాజీ ప్రియుడిపై కక్షతో ఓ యువతి తన స్నేహితుడితో కలిసి షీ టీమ్స్ పేరుతో నకిలీ నోటీసు పంపింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

షీ టీమ్స్ పేరుతో మాజీ ప్రియుడికి ఫేక్ నోటీసు.. హైదరాబాద్‌లో యువతి నిర్వాకం
Fake She Teams Notice

హైదరాబాద్, నవంబర్ 18: భాగ్యనగరంలో మాజీ ప్రియుడిపై కోపంతో మాజీ గర్ల్‌ఫ్రెండ్ చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రియుడిపై కక్షతో ఏకంగా షీ టీమ్స్‌ పేరుతో ఫేక్ నోటీసు పంపడం సంచలనంగా మారింది. తన స్నేహితుడితో కలిసి ఓ యువతి.. షీ టీమ్స్ పేరుతో ఫేక్ నోటీసును తయారు చేసింది. Unknown నంబర్ నుంచి తన మాజీ ప్రియుడికి షీ టీమ్స్ పోలీసులు పంపించినట్లుగా యువతి నోటీసు పంపింది. అయితే ఆ నోటీసుపై అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే షీ టీమ్స్ పోలీసులను ఆశ్రయించాడు.


తమ పేరుతో తయారైన ఫేక్ నోటీసు చూసి షీ టీమ్స్ పోలీసులు కూడా షాక్ అయిన పరిస్థితి. వెంటనే ఈ వ్యవహారంపై సైఫాబాద్ పోలీసులకు షీ టీమ్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫేక్ నోటీసు పంపిన యువతి వివరాలను సేకరించేందుకు యత్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

సిద్దిపేటలో సీఎం రేవంత్‌కు వినూత్న స్వాగతం.. ఆగిపోయిన పనులపై ఫ్లెక్సీలతో నిరసన

క్రీడాకారులకు కోచ్‌లను నియమించండి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 12:49 PM