Share News

సిద్దిపేటలో సీఎం రేవంత్‌కు వినూత్న స్వాగతం.. ఆగిపోయిన పనులపై ఫ్లెక్సీలతో నిరసన

ABN , Publish Date - Nov 18 , 2026 | 09:51 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 19న సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సంద్భంగా స్థానిక ప్రజలు వినూత్న రీతిలో నిరసనను వ్యక్తం చేశారు.

సిద్దిపేటలో సీఎం రేవంత్‌కు వినూత్న స్వాగతం.. ఆగిపోయిన పనులపై ఫ్లెక్సీలతో నిరసన
Siddipet News

సిద్దిపేట, నవంబర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 19న (గురువారం) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సంద్భంగా స్థానిక ప్రజలు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్‌.. ఇదే మా సాదర ఆహ్వానం’ అంటూ సిద్దిపేట ప్రజలు, విద్యార్థులు, పర్యాటక అభిమానుల పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. గత ప్రభుత్వ హయాంలో మంజూరై.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించాలని ఫ్లెక్సీల ద్వారా నిరసన గళం వినిపించారు. ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు.


పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయిన వెటర్నరీ కళాశాల భవనం పనులను ఎప్పుడు పూర్తి చేస్తారని ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు. వెటర్నరీ కళాశాలను తిరిగి కొనసాగించాలని విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అదేవిధంగా సిద్దిపేటలోని శిల్పారామం, వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులపైనా ఫ్లెక్సీలను ప్రదర్శించారు. వీటితో పాటు సిద్దిపేట-ఇల్లంతకుంట రోడ్డు, వెజ్‌-నాన్‌వెజ్ మార్కెట్ పనులపైనా ప్రశ్నలు కురిపించారు. ఆగిన పనులకు మోక్షం కల్పించాలని సీఎం రేవంత్‌కు సిద్దిపేట ప్రజలు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా వెలసిన ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి.


ఇవి కూడా చదవండి..

ఆసియాన్‌కు నవశకం

అక్వాన్ తుపానుపై విద్యుత్ శాఖ అప్రమత్తం.. అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి ఆదేశాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 10:31 AM