Share News

‘మీరు ఎప్పటికీ మా తలా’.. ధోనీకి రుతురాజ్ భావోద్వేగ వీడ్కోలు!

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:57 AM

ఐపీఎల్‌కు ఆటగాడిగా వీడ్కోలు పలికిన 'కెప్టెన్ కూల్' ఎంఎస్ ధోనీకి సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భావోద్వేగ సందేశం ఇచ్చాడు. ‘మీరు ఎప్పటికీ మా తలా, మా కెప్టెన్’ అంటూ ధోనీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

‘మీరు ఎప్పటికీ మా తలా’.. ధోనీకి రుతురాజ్ భావోద్వేగ వీడ్కోలు!
MS Dhoni

స్పోర్ట్స్ డెస్క్: చెన్నై సూపర్‌ కింగ్స్‌ను అంతా తానై నడిపించిన ‘కెప్టెన్‌ కూల్‌’ మహేంద్ర సింగ్‌ ధోనీ శకం ముగిసింది. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అందర్నీ ఆశ్య‌ర్య‌ప‌రిచాడు. ధోని తీసుకున్న నిర్ణ‌యం అభిమానుల‌నే కాదు, సీఎస్కే ఆట‌గాళ్ల‌ను సైతం ఆవేదనకు గురి చేసింది. ఈ నేప‌థ్యంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త‌న అభిమాన ఆట‌గాడు ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డంపై భావోద్వేగానికి గురయ్యాడు. ధోనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.


'సింప్లిసిటీ అనే దానికి ధోని ప‌ర్యాయ‌ప‌దం. నేను 2019లో మొద‌టిసారి చెన్నై జట్టులో చేరిన స‌మ‌యంలో సింప్లిసిటీ అనే ప‌దానికి స‌రైన అర్థాన్ని తెలుసుకున్నా. కెరీర్‌లో ఎన్ని ఘనతలు సాధించినప్పటికీ ధోనీ ఎంతో సాధారణంగా, హుందాగా ఉంటాడు. ఆయనతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, 22 గజాల పిచ్‌పై కలిసి ఆడుతూ జట్టును గెలిపించడం ద్వారా నా కల నిజమైనట్లుగా అనిపించింది. ధోని ఏ పాత్రలో ఉన్నా సరే, ఎప్పటికీ ఆయనే మా 'తలా(నాయకుడు)'. మా కెప్టెన్‌, మా లీడర్‌. మాకు అన్నివేళల మద్దతుగా నిలిచిన మహీ భాయ్‌కు కృతజ్ఞతలు' అంటూ రుతురాజ్ భావోద్వేగానికి గురయ్యాడు.


దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ ఐపీఎల్ ప్రయాణం తర్వాత ధోనీ ఆటగాడిగా తప్పుకున్నాడు. గాయం కారణంగా 2026 సీజన్‌కు దూరమైన ఆయన, రిటెన్షన్ గడువుకు ముందే ఆటగాడిగా తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ధోని సారథ్యంలో సీఎస్కే ఐదు ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడింది. ఇప్పటిదాకా ఆటగాడిగా ఐపీఎల్‌లో కొనసాగిన ధోని 2027 సీజన్ నుంచి సీఎస్కే మెంటార్‌గా జట్టును మార్గనిర్దేశం చేయనున్నాడు. ఈ పాత్రలో కూడా విజయవంతం కావాలని ఆయన అభిమానులతో సహా అందరూ కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

26న హైదరాబాద్‌లో సంవిధాన్‌ రక్షా మార్చ్‌

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

అమితాబ్, అభిషేక్ బచ్చన్‌ల హత్యకు 200 మంది సిద్ధం.. గోల్డీ ధిల్లాన్ మరోసారి బెదిరింపులు..

Updated Date - Nov 18 , 2026 | 07:04 AM