Share News

రేపు రాష్ట్రానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:41 AM

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం రాష్ట్రానికి రానున్నారు.

రేపు రాష్ట్రానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ
Nitin Gadkari

  • సీఎం రేవంత్‌తో కలిసి ఐఆర్‌సీ సదస్సు ప్రారంభోత్సవం

  • రాష్ట్రానికి మంజూరైన జాతీయ రహదారులపై సమీక్ష

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించే 85వ ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌(ఐఆర్‌సీ) సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఉదయం 11.30 గంటలకు సదస్సును ప్రారంభించి.. కీలక ఉపన్యాసం చేయనున్నారు.


కాగా సదస్సులో రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉందని తెలిసింది. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణకు మంజూరైన జాతీయ రహదారుల నిర్మాణాలు, వాటి పురోగతిపై కేంద్రమంత్రి ప్రత్యేకంగా సమీక్షించనున్నారు.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 06:41 AM