Share News

రిమాండ్‌పై ముగిసిన వాదనలు.. గుంటూరు జైలుకు వాసుదేవరెడ్డి..

ABN , Publish Date - Feb 21 , 2026 | 07:49 PM

జగన్ మోహన్ రెడ్డి హయాంలో.. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఎండీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మద్యం పాలసీ రూపకల్పన, కంపెనీల ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు..

రిమాండ్‌పై ముగిసిన వాదనలు.. గుంటూరు జైలుకు వాసుదేవరెడ్డి..
Vasudeva Reddy

విజయవాడ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): జగన్ మోహన్ రెడ్డి హయాంలో.. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఎండీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మద్యం పాలసీ రూపకల్పన, కంపెనీల ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు A2గా చేర్చారు.


అయితే ఇవాళ(శనివారం) వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టులో వాసుదేవరెడ్డి రిమాండ్‌పై వాదనలు ముగిశాయి. మద్యం కుంభకోణం కేసులో ఏ2 వాసుదేవరెడ్డికి పిబ్రవరి 27 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గతంలో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 21 , 2026 | 07:55 PM