Share News

రూ.3,000 కోట్ల ఉపాధి హామీ నిధులను నొక్కేశారు.. వైసీపీపై అశోక్‌బాబు ఫైర్

ABN , Publish Date - Nov 06 , 2026 | 02:51 PM

గ్రామీణ వ్యవస్థను వైసీపీ సర్వనాశనం చేసిందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన కోట్ల రూపాయల పంచాయతీ నిధులను మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి దారి మళ్లించి పప్పుబెల్లాల్లా వాడేశారని మండిపడ్డారు.

రూ.3,000 కోట్ల ఉపాధి హామీ నిధులను నొక్కేశారు.. వైసీపీపై అశోక్‌బాబు ఫైర్
Ashok Babu

అమరావతి, నవంబర్ 6: గ్రామీణ వ్యవస్థను వైసీపీ సర్వనాశనం చేసిందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన కోట్ల రూపాయల పంచాయతీ నిధులను మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి దారి మళ్లించి పప్పుబెల్లాల్లా వాడేశారని మండిపడ్డారు. కరోనా విపత్తులోనూ పల్లెల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు పైసలు లేకుండా చేసిన పాపం జగన్‌దే అంటూ ఫైర్ అయ్యారు. రైతుల ధాన్యం బకాయిలు ఎగ్గొట్టారని.. కూటమి ప్రభుత్వం రాగానే రూ.1,600 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని తెలిపారు.


ఇంటింటికీ చెత్త పన్ను వేసి ప్రజలను పీడించారని.. కట్టకపోతే పింఛన్లు ఆపుతామని బెదిరించారని మాజీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. రూ. 3,000 కోట్ల విలువైన ఉపాధి హామీ నిధులను వైసీపీ కార్యకర్తలు బొక్కేశారని ఆరోపించారు. నాసిరకం చీప్ లిక్కర్ బ్రాండ్లతో గ్రామీణ ప్రజల జేబులు గుల్ల చేసి, ప్రాణాలు తీశారన్నారు. కూటమి సర్కార్‌లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలో నగదు జమ చేసినట్లు చెప్పారు. పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా రూ.4,100 కోట్ల కేంద్ర నిధులు రప్పించి అభివృద్ధి చేస్తున్నామన్నారు.


డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ‘అడవి బాట’ కింద అటవీ ప్రాంతాల్లో 1,974 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అశోక్‌బాబు అన్నారు. ‘పల్లె పండుగ’ ద్వారా 12,500 కి.మీ. సీసీ రోడ్లు, 19,100 కి.మీ. బీటీ రోడ్లు వేశామన్నారు. రైతుల కోసం 60 వేల పంట కుంటలు, పాడి రైతుల కోసం 60 వేల గోకులం షెడ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో ఆగిపోయిన పేదల ఇళ్లను పూర్తి చేసి.. 8 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయించామన్నారు. జలజీవన్ మిషన్ కింద రూ.12,000 కోట్లతో 90 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు. గ్రామాల్లోని బడులను పటిష్ఠం చేస్తూ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అన్నారు. గ్రామాల్లో కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. రేపటి జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌లోనూ గెలుపు ఖాయమని అశోక్ బాబు ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

కురుపాం గురుకుల ఘటనపై ఏబీఎన్ కథనం.. స్పందించిన మంత్రి సంధ్యారాణి

తమిళనాడు బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 03:00 PM