Share News

కురుపాం గురుకుల ఘటనపై ఏబీఎన్ కథనం.. స్పందించిన మంత్రి సంధ్యారాణి

ABN , Publish Date - Nov 06 , 2026 | 10:00 AM

పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల పాఠశాల ఘటనపై ఏబీఎన్‌లో వచ్చిన కథనం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. విద్యార్థినుల అస్వస్థతపై స్పందించిన మంత్రి సంధ్యారాణి వెంటనే చర్యలు చేపట్టారు.

కురుపాం గురుకుల ఘటనపై ఏబీఎన్ కథనం.. స్పందించిన మంత్రి సంధ్యారాణి
Minister Sandhyarani

పార్వతీపురం మన్యం, నవంబర్ 6: జిల్లాలోని కురుపాం గురుకుల పాఠశాల ఘటనపై ఏబీఎన్‌లో వచ్చిన కథనం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. విద్యార్థినుల అస్వస్థతపై స్పందించిన మంత్రి సంధ్యారాణి వెంటనే చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఏబీఎన్‌‌తో మంత్రి మాట్లాడుతూ.. మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో తక్షణం వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కురుపాం గురుకుల విద్యార్థినులకు వైరల్ ఫీవర్స్ వల్లనే వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం పిల్లలందరి ఆరోగ్యం బాగుందని.. మెరుగైన వైద్యం అందుతోందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.


కాగా.. కురుపాం గురుకుల పాఠశాలలో దాదాపు 44 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవడం తీవ్ర కలకలం రేపింది. స్కూల్ యాజమాన్యం వెంటనే విద్యార్థులను మాదలింగ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందజేశారు. గత ఏడాది ఇదే విద్యాసంస్థలో పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరిలో ముగ్గురు విద్యార్థినుల మృతి సంచలనం రేపింది.


ఇవి కూడా చదవండి...

డాక్టర్‌‌ను ఇంటికి పిలిచి చితకబాది 3.5 లక్షల దోపిడీ.. ఇద్దరు నటుల అరెస్టు

మగాళ్లైతే రండి రా.. మాల్యవంతంలో వైసీపీ నాయకుల కవ్వింపు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 10:07 AM