Share News

తమిళనాడు బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:08 PM

తమిళనాడు మత్స్యకారుల బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తమిళనాడు బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 6: తమిళనాడు మత్స్యకారుల బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈనెల 3న తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు.. ప్రకాశం జిల్లా కొత్తపట్నం వద్ద సముద్రంలో బోల్తా పడి తీరానికి కొట్టుకొచ్చిన విషయం తెలిసిందే. బోటులో మొత్తం 9 మంది ఉండగా... ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ‘మురసు’ తుఫాన్‌ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.


గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమన్వయంతో పనిచేయాలని కోస్ట్‌గార్డ్‌, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులకు సూచనలు చేశారు. పోస్టుమార్టం తదితర ప్రక్రియలు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు అధికారులతో సమన్వయం చేసుకుని మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.


బోటు ప్రమాదంపై హోంమంత్రి..

తమిళనాడు మత్స్యకారుల బోటు ప్రమాదంపై హోంమంత్రి అనిత విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుఫాన్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ప్రమాదం జరిగిందన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కోస్ట్‌ గార్డ్, మెరైన్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని హోం మంత్రి అనిత సూచించారు.


ఇవి కూడా చదవండి...

మగాళ్లైతే రండి రా.. మాల్యవంతంలో వైసీపీ నాయకుల కవ్వింపు

కురుపాం గురుకుల ఘటనపై ఏబీఎన్ కథనం.. స్పందించిన మంత్రి సంధ్యారాణి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 01:23 PM