Share News

హైదరాబాద్‌లో కల్తీ పాల తయారీ గుట్టురట్టు.. 100 లీటర్ల సీజ్

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:00 AM

హైదరాబాద్‌లో కల్తీ పాల తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లోని పరిధి పోచారం గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ మహేశ్వరం జోన్ పోలీసులు దాడులు నిర్వహించారు

హైదరాబాద్‌లో కల్తీ పాల తయారీ గుట్టురట్టు.. 100 లీటర్ల సీజ్
Adulterated Milk

హైదరాబాద్, నవంబర్ 6: భాగ్యనగరంలో కల్తీ పాల తయారీ కలకలం రేపుతోంది. కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు పక్కా సమాచారంతో సదరు కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ మహేశ్వరం జోన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్‌పూర్ పాలపొడిని కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇలా తయారు చేసిన కల్తీ పాలను హైదరాబాద్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు అధికారుల దాడుల్లో బయటపడింది.


కల్తీ పాల తయారీ, సరఫరా చేస్తున్న ఆండే శ్రీశైలంను(43) SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీశైలం.. పోచారం గ్రామంలో నివాసం ఉంటూ పాల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో100 లీటర్ల కల్తీ పాలతో పాటు1 లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్‌పూర్ పాలపొడి ప్యాకెట్లు 35(ఒక్కోటి కిలో) అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్తీ పాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారి పట్ల కఠిన చర్యలు తప్పని పోలీసులు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

మగాళ్లైతే రండి రా.. మాల్యవంతంలో వైసీపీ నాయకుల కవ్వింపు

కురుపాం గురుకుల ఘటనపై ఏబీఎన్ కథనం.. స్పందించిన మంత్రి సంధ్యారాణి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 11:05 AM