Share News

ఏపీలో 17 మేయర్ పదవులకు రిజర్వేషన్ల ఖరారు

ABN , Publish Date - Oct 12 , 2026 | 03:25 PM

ఏపీలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 252ను జారీ చేసింది.

ఏపీలో 17 మేయర్ పదవులకు రిజర్వేషన్ల ఖరారు
Local Body Elections

అమరావతి, అక్టోబర్ 12: ఏపీలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 252ను జారీ చేసింది. ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు మేయర్ పదవులు కేటాయిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీలకు ఐదు మేయర్ పదవులను రిజర్వ్ చేసింది. జనరల్ మహిళలకు ఐదు మేయర్ పదవులను కేటాయించగా.. నాలుగు కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించింది.


మంగళగిరి-తాడేపల్లి మేయర్ పదవిని ఎస్టీ జనరల్‌కు ప్రభుత్వం కేటాయించింది. కర్నూలు మేయర్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసింది. రాజమహేంద్రవరం మేయర్ పదవి ఎస్సీ జనరల్‌కు కేటాయించగా... కాకినాడ, మచిలీపట్నం మేయర్ పదవులు బీసీ మహిళలకు రిజర్వ్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏలూరు, అనంతపురం, చిత్తూరు మేయర్ పదవులను బీసీ జనరల్‌కు కేటాయించింది.


విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు జీవీఎంసీ మేయర్ పదవులను జనరల్ మహిళలకు సర్కార్ రిజర్వ్ చేసింది. అలాగే తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ పదవులు అన్‌రిజర్వ్‌డ్‌‌గా ప్రకటించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం.. కిలో రూ.49కే బీపీటీ సన్నాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 04:42 PM