Share News

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 10:51 AM

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో ఆర్టీ నంబర్ 1985 ద్వారా అధికారులకు కొత్త పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలను కేటాయిస్తు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
AP IAS Transfers

అమరావతి, అక్టోబర్ 12: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో ఆర్టీ నంబర్ 1985 ద్వారా అధికారులకు కొత్త పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలను కేటాయిస్తు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సౌరభ్ గౌర్‌కు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పోస్టింగ్ ఇచ్చింది. డి. మురళీధర్ రెడ్డికి గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించింది. మంజులే బాలాజీ దిగంబర్‌కు ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


అలాగే అమ్రపాలి కటాను పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా నియమించింది. కె. నీలకంఠ రెడ్డికి యువజన సేవల డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇవ్వగా, బి. అనిల్ కుమార్ రెడ్డికి పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఎన్. తేజ్ భరత్‌ను ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. గెడెల శ్రీనుకుమార్‌కు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఉప కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది. ఎం. వరప్రసాద్‌ను ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


కె. శ్రీనివాసులుకు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. శుభం బన్సాల్‌కు ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ అధికారుల పోస్టింగులు, అదనపు బాధ్యతలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

ఇండి కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. ఢిల్లీలోని ఆరు మెట్రో స్టేషన్ల మూసివేత

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 11:01 AM