ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్
ABN , Publish Date - Oct 12 , 2026 | 03:11 PM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు(సోమవారం) నాంపల్లి ఏసీబీ కోర్ట్‌లో ఈ పిటిషన్ వేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు(సోమవారం) నాంపల్లి ఏసీబీ కోర్ట్‌లో ఈ పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ వేసిన ఛార్జ్‌షీట్‌లో తన పేరును తొలగించాలని మాజీ మంత్రి కోరారు. నిందితుల జాబితా నుంచి తన పేరును తప్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేటీఆర్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు వచ్చే నెలలో(నవంబర్) విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో A1 నిందితుడిగా కేటీఆర్ పేరును ఏసీబీ అధికారులు ఛార్జ్‌షీట్‌లో చేర్చిన విషయం తెలిసిందే. ఏసీబీ వేసిన ఛార్జ్‌షీట్‌ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ రెండు సార్లు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు తాజాగా ఏసీబీ ఛార్జ్‌షీట్‌లో తన పేరును తొలగించాలంటూ కేటీఆర్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. దీనిపై త్వరలోనే ఏసీబీ కోర్ట్ విచారణ చేయనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
‘ఫసల్ బీమా అమలు చేయాల్సిందే’.. రేవంత్ సర్కార్‌కు రాంచందర్ హెచ్చరిక
సింగూరు ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటి: హరీశ్ రావు
Read Latest Telangana News And Telugu News