Share News

తిరుపతిలో రూ.3,222 కోట్ల పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

ABN , Publish Date - Oct 12 , 2026 | 02:21 PM

తిరుపతి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

తిరుపతిలో రూ.3,222 కోట్ల పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం
CM Chandrababu Naidu

అమరావతి, అక్టోబర్ 12: తిరుపతి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈరోజు(సోమవారం) అమరావతి సచివాలయం నుంచి వర్చువల్‌గా పనులకు శంకుస్థాపన చేశారు. భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా రూ.2750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ రెండేళ్లో పూర్తి చేయాలని.. ప్రారంభోత్సవాన్ని నిర్ణయించుకుని పని మొదలు పెట్టాలని ఈ సందర్భంగా అధికారులను చంద్రబాబు ఆదేశించారు. డబ్బుల కోసం కాకుండా దేవుడి కోసం పని చేసే ఏజెన్సీలను అవకాశం ఇవ్వాలని సూచించారు.


తిరుమలలోని వాతావరణం ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్‌లో కూడా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతిలో పవిత్రమైన వాతావరణం లేకపోతే మంచిది కాదని.. తిరుపతికి వస్తే ప్రతి ఒక్కరికీ స్వర్గం అంటే ఇట్లుంటుంది అనే అనుభూతి కలిగేలా చేయాలన్నారు. ఇలా చేస్తే మనకూ పుణ్యం వస్తుందని చెప్పారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య, వైద్యం, పరిశ్రమలతో క్లీన్, గ్రీన్ సిటీగా అద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపొందించాలని సూచించారు. టీటీడీ ఉద్యోగులు ఆత్మ గౌరవంతో ఉండేలా హౌస్ సైట్ ఏర్పాట్లు ఉండాలని.. మోడరన్ టౌన్ షిప్‌ను ఏర్పాటు చేయాలన్నారు. దేవుని మీద భక్తిని పెంచడానికి, సేవ గుణాన్ని, ​గోశాలలను ఒక ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా తయారు చేసి గోవులకు సేవ చేసేలా అభివృద్ధి చేయాలన్నారు.


​దేవుడంటే నేచర్‌ని కాపాడటం అని, ఆయనతో అనుసంధానం కావాలంటే నేచర్‌నే ఆరాధించే మనస్తత్వాన్ని తెప్పించాలని సీఎం సూచించారు. చెరువులను అనుసంధానం చేయాలని.. అక్కడ సుప్రభాతం వింటూ వాకింగ్ చేసేలా ఉండాలన్నారు. స్పిరిచువాలిటీ, టెక్నాలజీ కలిస్తే ఒత్తిడి లేని ఫలితాలు వస్తాయన్నారు. తిరుపతి ఎకనమిక్ యాక్టివిటీ పెరగాలని, స్థానికులకు స్కిల్స్, ఉద్యోగ అవకాశాలు పెరగాలని తెలిపారు. తిరుమలలో గ్రీనరీ ఉన్నట్లు తిరుపతిలో కూడా రావాలని... తిరుమల కొండను చూస్తే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ ఎం.రవిచంద్ర సహా టీటీడీ పాలక మండలి సభ్యులు, తిరుపతి జిల్లా కలెక్టర్, తుడా అధికారులు.. వర్చువల్‌గా హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం.. కిలో రూ.49కే బీపీటీ సన్నాలు

విశాఖలో గ్యాస్ సిలిండర్‌కు నిప్పు.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 02:43 PM