విశాఖలో గ్యాస్ సిలిండర్‌కు నిప్పు.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:39 AM
విశాఖలోని మధురవాడలో విషాదం ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంలో తండ్రి మృతిచెందగా, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రంపాలెంలో గ్యాస్ సిలిండర్‌కు నిప్పంటించడంతో ఈ ఘటన జరిగింది.
విశాఖపట్నం, అక్టోబర్ 12: నగరంలోని మధురవాడలో విషాదం ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంలో తండ్రి మృతిచెందగా, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రంపాలెంలో గ్యాస్ సిలిండర్‌కు నిప్పంటించడంతో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తండ్రి సావిరెడ్డి గోవిందరావు(55), కుమారుడు త్రినాథ్(24) మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మరోసారి ఘర్షణ జరగడంతో ఇంట్లో బట్టలకు నిప్పుపెట్టడంతో పాటు గ్యాస్ సిలిండర్‌కు నిప్పంటించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తండ్రి మృతిచెందాడు. కుమారుడు త్రినాథకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం.. కిలో రూ.49కే బీపీటీ సన్నాలు
Read Latest AP News And Telugu News