గోల్డ్ రేట్స్.. మళ్లీ తగ్గాయిగా.. ప్రస్తుతం ధరలు ఎంతంటే..
ABN , Publish Date - Oct 12 , 2026 | 10:33 AM
భారత్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ధరల్లో ఎగుడుదిగుడులు కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ధరల్లో ఎగుడుదిగుడులు కనిపిస్తున్నాయి. గత వారం చివర్లో రూ.1800 మేర పెరిగిన మేలిమి పసిడి ధర నేడు రూ.440 మేర తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (అక్టోబర్ 12) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.440 మేర తగ్గి రూ.1,50,980కు దిగొచ్చింది. 22 క్యారెట్ల పసిడి ధరలో కూడా రూ.400 మేర కోత పడింది. ప్రస్తుతం ధర రూ.1,38,400కు పడిపోయింది. నగరంలో వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.45 లక్షలుగా ఉంది.
తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
నిజామాబాద్ | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
ఖమ్మం | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పుత్తడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విశాఖపట్నం | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
విజయవాడ | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
అమరావతి | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
కాకినాడ | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
తిరుపతి | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,700 |
ముంబై | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
ఢిల్లీ | ₹1,51,130 | ₹1,38,550 | ₹1,13,390 |
కోల్‌కతా | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
బెంగళూరు | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
కేరళ | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
పుణె | ₹1,50,980 | ₹1,38,400 | ₹1,13,240 |
వడోదరా | ₹1,51,030 | ₹1,38,450 | ₹1,13,290 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్