బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అవకాశం ఉంది: రామ్మోహన్ నాయుడు
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:31 PM
బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం సుప్రీంకోర్టులో అవకాశం ఉంది కాబట్టే కోర్టుకు వచ్చామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఢిల్లీ, అక్టోబర్ 6: బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం సుప్రీంకోర్టులో అవకాశం ఉంది కాబట్టే కోర్టుకు వచ్చామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు (మంగళవారం) ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనపై న్యాయ నిపుణులతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, పార్థసారథి చర్చలు జరిపారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్లు షెడ్యూల్ 9లో చేర్చే అంశంపై అనేక రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
సమస్యను జటిలం చేసుకోకుండా పరిష్కారం కోసం చూస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. బీసీల పట్ల వైసీపీకి ఎందుకంత కక్ష అంటూ మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వారికి రిజర్వేషన్లు వస్తే 16,800 పోస్టులు బీసీలకు వస్తాయన్నారు. ఇది రాజకీయానికి సంబంధించిన అంశం కాదని.. సామాజిక న్యాయానికి సంబంధించిన అంశమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Read Latest AP News And Telugu News