Share News

శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ABN , Publish Date - Oct 06 , 2026 | 03:02 PM

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరుగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు.

శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
Srisailam, Dasara Celebrations

అమరావతి, అక్టోబర్ 6: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరుగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మేరకు ఈరోజు(మంగళవారం) ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో యం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆపై శ్రీశైలం దేవస్థానం ఆలయ పండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించారు.


అలాగే శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను ముఖ్యమంత్రికి దేవాలయ అధికారులు అందించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లపై అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

భారత రక్షణ రంగంలో హిందూస్థాన్ షిప్ యార్డ్ కీలకపాత్ర: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

పేదల సొంతింటి కల సాకారం సీఎం చంద్రబాబుతోనే సాధ్యం: సుజాత

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 03:16 PM