Share News

పేదల సొంతింటి కల సాకారం సీఎం చంద్రబాబుతోనే సాధ్యం: సుజాత

ABN , Publish Date - Oct 06 , 2026 | 02:15 PM

పేదల సొంతింటి కల సాకారం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత అన్నారు. ఇప్పటికే 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామని తెలిపారు.

పేదల సొంతింటి కల సాకారం సీఎం చంద్రబాబుతోనే సాధ్యం: సుజాత
peethala sujatha

అమరావతి, అక్టోబర్ 6: పేదల సొంతింటి కల సాకారం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత అన్నారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామని తెలిపారు. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కడతామని చెప్పిన జగన్.. ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. పేదలకు ఇళ్లు కట్టకపోగా 6 లక్షల ఇళ్లను రద్దు చేసి వారి కలలను చిదిమేశారని మండిపడ్డారు.


సెంటు పట్టాల పేరుతో జగన్ అక్రమార్జన విలువ రూ.7 వేల కోట్లు అని సుజాత ఆరోపించారు. నేడు రాష్ట్రానికి సాధారణ కోటా కింద కేంద్రం నుంచి 75 వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి అదనంగా 3 లక్షల ఇళ్లు మంజూరు చేయించిన ఘనత సీఎం చంద్రబాబుదే అని కొనియాడారు. తెనాలిలో దేశంలోనే తొలిసారిగా 3D టెక్నాలజీతో 177 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. కొత్తగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారన్నారు.


PMAY-U 2.0 2026 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని సుజాత చెప్పారు. పేదల గృహ నిర్మాణంలో పారదర్శకత, వేగవంతమైన అమలుకు ఈ గుర్తింపు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ‘స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్’కు గృహ నిర్మాణంలో సాధించిన పురోగతికి ఉదాహరణ అని తెలిపారు. 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పీతల సుజాత స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం: కండక్టర్‌పై చర్యలకు మంత్రి ఆదేశం

భారత రక్షణ రంగంలో హిందూస్థాన్ షిప్ యార్డ్ కీలకపాత్ర: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 02:40 PM