Share News

సిరిసిల్లకు మంత్రి పదవి కొత్తదా?.. రేవంత్‌పై కవిత తీవ్ర విమర్శలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:38 PM

రాజన్న సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ చీఫ్ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లకు మంత్రి పదవి కొత్తేమీ కాదని, గత పదేళ్లుగా ఇక్కడ మంత్రి ఉన్నారని అన్నారు.

సిరిసిల్లకు మంత్రి పదవి కొత్తదా?.. రేవంత్‌పై కవిత తీవ్ర విమర్శలు
Sirisilla Development

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 6: సిరిసిల్లకు మంత్రి పదవి కొత్తేమీ కాదని టీఆర్‌ఎస్‌ చీఫ్ కల్వకుంట్ల.. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్లుగా ఇక్కడ మంత్రి ఉన్నారని అన్నారు. ఇప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పి మరోసారి ప్రజలను నమ్మించి ఓట్లు అడగడం ఎందుకని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. సిరిసిల్లకు నిధులు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి స్వయంగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి రాజకీయాలు తప్ప మరే అంశంపై దృష్టి లేదని కవిత విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిరిసిల్ల.. వేములవాడ ప్రాంతాల్లో ఒక్క ఎకరాకు కూడా నీరు రాలేదని ఆమె ఆరోపించారు.


వేములవాడ ఆలయ అభివృద్ధిపై కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ అభివృద్ధిని కాంక్రీట్‌ నిర్మాణాలతో కాకుండా కృష్ణా శిలతో చేపట్టాలని సూచించారు. ఆలయానికి ఉన్న చారిత్రక.. ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నేరెళ్ల ఇసుక బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల అభివృద్ధి, సాగునీటి సమస్యలు, నేరెళ్ల బాధితుల అంశాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కవిత కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సీపీఐతో చర్చించాకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై నిర్ణయం: తమ్మినేని

‘మహాలక్ష్మి’కి మస్త్‌ డిమాండ్‌!

Read Latest AP News And Telangana News

Updated Date - Oct 06 , 2026 | 01:12 PM