బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం: కండక్టర్‌పై చర్యలకు మంత్రి ఆదేశం
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:46 AM
బస్సులో పరిచయమైన కండక్టర్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ఆరోపించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేసి దాదాపు రూ.20 లక్షల వరకు నగదు, బంగారాన్ని తీసుకున్నారని వాపోయింది.
అమరావతి, అక్టోబర్ 6: బస్సులో పరిచయమైన కండక్టర్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ఆరోపించారు. తనను ప్రేమ పేరుతో మోసం చేసి దాదాపు రూ.20 లక్షల వరకు నగదు, బంగారాన్ని తీసుకున్నారని వాపోయారు. తనకు ఎదురైన సమస్యను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన బాధితురాలు.. ఆర్టీసీ కండక్టర్‌పై ఫిర్యాదు చేశారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసిన యువతి.. తనకు జరిగిన పరిణామాలను వివరించి, న్యాయం చేయాలని కోరారు. బస్సులో పరిచయమైన కండక్టర్ ప్రేమ పేరుతో తనను మోసం చేశారని, తన నుంచి నగదు, బంగారం తీసుకున్నారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన మంత్రి.. కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఆర్ఎంకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్.. స్థానిక ఎన్నికలపై కీలక చర్చ
బీసీ 34 శాతం రిజర్వేషన్లపై జగన్‌కు బుద్దా వెంకన్న హెచ్చరిక
Read Latest AP News And Telugu News