Share News

మార్కాపురం జిల్లాలో చిరుత పులి కలకలం

ABN , Publish Date - Oct 06 , 2026 | 09:49 AM

మార్కాపురం జిల్లాలోని దోర్నాల మండలం బొమ్మలాపురంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. లింగయ్య డొంక వద్ద పొలాల్లో ఉన్న రైతులకు చిరుత కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.

మార్కాపురం జిల్లాలో చిరుత పులి కలకలం
Bommalapuram Leopard

మార్కాపురం, అక్టోబర్ 6: జిల్లాలోని దోర్నాల మండలం బొమ్మలాపురంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. లింగయ్య డొంక వద్ద పొలాల్లో ఉన్న రైతులకు చిరుత పులి కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన రైతులు కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి గ్రామం చివరి వీధి వైపు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఊహించని విధంగా చిరుత పులి గ్రామానికి సమీపంలో కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.


చిరుత పులి అటవీ ప్రాంతం నుంచి గ్రామం సమీపంలోకి రావడంతో బొమ్మలాపురం గ్రామస్థులు హడలిపోతున్నారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు, గ్రామ శివార్లలో సంచరించే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిరుత మళ్లీ గ్రామ పరిసరాల్లోకి వస్తుందేమోనని స్థానికులు భయపడుతున్నారు. దీంతో గ్రామ పరిసరాల్లో చిరుత సంచారంపై అధికారులు దృష్టి సారించి, ప్రజలు జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 11:23 AM