క్యూర్ ప్రాంతంలో ప్రకటనలకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
ABN , Publish Date - Oct 06 , 2026 | 03:44 PM
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతంలో తాత్కాలిక, హైపర్‌లోకల్ ప్రకటనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి వార్డుకు ఒక అడ్వర్డైజ్‌మెంట్ నోడల్ ఆఫీసర్‌ను నియమించనున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 6: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) ప్రాంతంలో తాత్కాలిక, హైపర్‌లోకల్ ప్రకటనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి వార్డుకు ఒక అడ్వర్డైజ్‌మెంట్ నోడల్ ఆఫీసర్‌ను నియమించనున్నారు. తాత్కాలిక ప్రకటనలకు గరిష్ఠంగా 3 రోజులు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అలాగే హైపర్‌లోకల్ ప్రకటనలకు గరిష్ఠంగా 7 రోజులపాటు అనుమతి ఉండనుంది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే యాడ్స్‌ను వెంటనే తొలగించడంతో పాటు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
పబ్లిక్ ప్రాపర్టీ, చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లపై ప్రకటనలు ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అదేవిధంగా ట్రాఫిక్, పాదచారుల మార్గాలు, సిగ్నల్స్, CCTVలకు ఆటంకం కలిగించేలా యాడ్స్ పెట్టరాదని ఆదేశించింది. కొత్త మార్గదర్శకాల అమలు బాధ్యతలను జీహెచ్‌ఎంసీ, సీఎమ్‌సీ, ఎమ్‌ఎమ్‌సీ కమిషనర్లకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది.
ఇవి కూడా చదవండి..
బీసీ 34 శాతం రిజర్వేషన్లపై జగన్‌కు బుద్దా వెంకన్న హెచ్చరిక
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. ‘SIR’ ప్రక్రియ ఆపాలి: ఎంపీ చామల
Read Latest Telangana News And Telugu News