Share News

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. ‘SIR’ ప్రక్రియ ఆపాలి: ఎంపీ చామల

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:04 PM

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని, ‘సర్’ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. ‘SIR’ ప్రక్రియ ఆపాలి: ఎంపీ చామల
MP Chamala Kiran Kumar Reddy

ఢిల్లీ, అక్టోబర్ 6: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని, ‘సర్’ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు(మంగళవారం) ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరుతో అనేక రాష్ట్రాలలో లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు. పార్లమెంట్ మకర ద్వారా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు ర్యాలీగా వెళ్తామని.. ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి పత్రాన్ని అందజేస్తామని చెప్పారు.


కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి మంత్రి అమిత్ షా తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామాన్ని ఇద్దరూ కూడా ఖూనీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ నుంచి ఈసీ వరకు వెళ్లకుండా ఎంపీల హక్కులను కాలరాస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.


కాగా.. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలంతా ఆందోళన చేయనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ మకరద్వారానికి ఇండియా కూటమి ఎంపీలు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎన్నికల సంఘం కార్యాలయంవైపు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.


ఇవి కూడా చదవండి..

చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్.. స్థానిక ఎన్నికలపై కీలక చర్చ

బీసీ 34 శాతం రిజర్వేషన్లపై జగన్‌కు బుద్దా వెంకన్న హెచ్చరిక

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 12:10 PM