పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Oct 06 , 2026 | 03:26 PM
దేశంలోని పది రాష్ట్రాల్లో ఏపీ కౌంటర్ ఇంటిలిజన్స్‌కు చెందిన 12 బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు.
అమరావతి, అక్టోబర్ 6: దేశంలోని పది రాష్ట్రాల్లో ఏపీ కౌంటర్ ఇంటిలిజన్స్‌కు చెందిన 12 బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వీరిరువురూ పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. డబ్బు కోసం పాకిస్థాన్‌కు రహస్య సమాచారం అందిస్తున్న నేవీ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే విశాఖ నేవల్ బేస్ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని కూడా కౌంటర్ ఇంటిలిజన్స్ బృందాలు అరెస్ట్ చేశాయి.
కోయంబత్తూర్‌లో ప్రదీప్ ముఖర్జీని అరెస్ట్ చేసిన అధికారులు.. విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. పాకిస్థాన్‌కు సమాచారం చేరవేసేందుకు వాట్సాప్ యాక్టివేట్ చేయడానికి ఓటీపీ షేర్ చేసి సున్నితమైన సమాచారం అందిస్తున్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో ప్రదీప్‌నకు ఈనెల 14 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మొత్తం 13 మంది నేవీ సిబ్బందితో సహా 18 మంది అనుమానితులను కౌంటర్ ఇంటిలిజన్స్ బృందం విచారించింది. అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, కేరళం, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గడ్, బిహార్‌లో ‘ఆపరేషన్ ఫైర్ వాల్’ పేరిట కౌంటర్ ఇంటిలిజన్స్ బృందాలు దాడులు నిర్వహించాయి.
ఇవి కూడా చదవండి..
పేదల సొంతింటి కల సాకారం సీఎం చంద్రబాబుతోనే సాధ్యం: సుజాత
శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
Read Latest AP News And Telugu News