Share News

వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలి.. పులివెందుల పోలీస్ స్టేషన్ ముందు బీటెక్ రవి ధర్నా

ABN , Publish Date - Nov 19 , 2026 | 02:28 PM

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ.. ఉద్దేశపూర్వకంగానే అల్లర్లకు పాల్పడి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్న వైసీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి.. అర్బన్ పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.

వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలి.. పులివెందుల పోలీస్ స్టేషన్ ముందు బీటెక్ రవి ధర్నా
b tech ravi protest in pulivendula

కడప, నవంబర్ 19: వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి డిమాండ్ చేశారు. పులివెందులలోని అర్బన్ పోలీస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


‘మున్సిపల్ ఎన్నికల సమయంలోనే వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఆ అల్లర్లలో పోలీసులపై రాళ్లదాడులకు పాల్పడిన వారిపై నాన్ బెయిల్ కేసు నమోదు చేశారు. కానీ ఇంకా వారిని అరెస్ట్ చేయలేదు. అందుకే.. పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. వారు మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. ఈ రోజు నామినేషన్ వేస్తున్న మా నేతలపై, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేసి గాయపరచాయి. బాధ్యులైన వైసీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని బీటెక్ రవి డిమాండ్ చేశారు. పులివెందులలో బిటెక్ రవికి మద్దతుగా నిలుస్తూ.. టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ధర్నాకు కూర్చున్నారు.


ఇవి కూడా చదవండి...

పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి

ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుపాను.. 24 నుంచి 36 గంటలు అప్రమత్తం

Read latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 02:31 PM