‘హోదా’ ఇచ్చేదాకా అసెంబ్లీకి రాను
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:10 AM
తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు శాసనసభ సమావేశాలకు హాజరు కానని వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్లీ చెప్పారు. అయితే సభలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై సాక్ష్యాధారాలతో తాను ప్రెస్ కాన్ఫరెన్సులు పెడతానన్నారు.
ప్రభుత్వ విధానాలపై ప్రెస్‌కాన్ఫరెన్సుల్లో మాట్లాడతా
చింతాడ, విరూపాక్షి, సీదిరిపై తప్పుడు కేసులు: జగన్
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు శాసనసభ సమావేశాలకు హాజరు కానని వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్లీ చెప్పారు. అయితే సభలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై సాక్ష్యాధారాలతో తాను ప్రెస్ కాన్ఫరెన్సులు పెడతానన్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ దాకా అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బుధవారం తాడేపల్లి ప్యాలె్‌సలో ఆయన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన మాట్లాడారు. తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే సభలో సమయం హక్కుగా వస్తుందని, ఆ హక్కును తనకివ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు.
మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నందున అక్కడ గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు సూచించారు. వైసీపీ బీసీ నాయకులపై కేసులు పెడుతున్నారని.. చింతాడ రవి, విరూపాక్షి, సీదిరి అప్పలరాజు, కారుమూరి సునీల్‌లపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. డీఎస్సీ లీకేజీలపై 74 రోజులుగా పోరాటాలు చేస్తున్నామని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంతా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేయడం ద్వారా ‘ఆంధ్ర ఫర్ సేల్’ చేసేశారని ఆరోపించారు. చంద్రబాబు విడుదల చేస్తున్న వైట్ పేపర్లన్నీ అబద్ధాల పత్రాలని విమర్శించారు.
వార్తలు కూడా చదవండి...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం
నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News