Share News

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం.. కాకినాడలో ముగ్గురు మత్స్యకారుల గల్లంతు

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:07 PM

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. తాళ్ళరేవు మండలం చోళ్ళంగిపేటకు చెందిన ముగ్గురు మత్సకారులు నిన్న(మంగళవారం) తెల్లవారుజామున హాప్ ఐలాండ్‌కు చేపల వేటకు వెళ్లారు.

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం.. కాకినాడలో ముగ్గురు మత్స్యకారుల గల్లంతు
Three Fishermen Missing

కాకినాడ జిల్లా, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. తాళ్ళరేవు మండలం చోళ్ళంగిపేటకు చెందిన ముగ్గురు మత్సకారులు నిన్న(మంగళవారం) తెల్లవారుజామున హాప్ ఐలాండ్‌కు చేపల వేటకు వెళ్లారు. వేటకు వెళ్లిన వారు ఇప్పటికీ తిరిగిరాక పోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. వారిని నీలపల్లి గంగరాజు (42), తండ్రి, నీలపల్లి ప్రసాద్ (17)కుమారుడు, డొంకా రాజు (31)గా గుర్తించారు. గల్లంతు అయిన మత్స్య కారుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మత్స్య కారుల ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్నబ్ తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు సిద్ధం చేయండి: సీఎం చంద్రబాబు

స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మం పాటించాల్సిందే.. శ్రేణులకు చంద్రబాబు, పవన్, మాధవ్ దిశానిర్దేశం

ఆర్న‌బ్ తుఫాన్‌ ప్రభావం.. ఏపీ ప్రభుత్వం స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:17 PM