వైసీపీ తీరును సభ్యసమాజం వ్యతిరేకిస్తోంది.. టీడీపీ ఎంపీల ధ్వజం
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:20 PM
శ్రీవారి కల్తీ లడ్డూ వ్యవహరంలో శాసనమండలిలో వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామి ఫొటోతో ఇవాళ ఆందోళనకు దిగారు. ఈ విషయమై మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు.
విజయనగరం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి కల్తీ లడ్డూ వ్యవహరంలో శాసనమండలిలో వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామి ఫొటోతో ఇవాళ(శుక్రవారం) ఆందోళనకు దిగారు. ఈ విషయంపై వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
వేంకటేశ్వరస్వామి చిత్రపటాలతో రాజకీయమా: ఎంపీ కలిశెట్టి
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి చిత్రపటాలు పట్టుకుని రాజకీయం చేస్తారా అని ధ్వజమెత్తారు. శాసనమండలిలో వైసీపీ తీరు సిగ్గు సిగ్గు అని ఎద్దేవా చేశారు. 'శ్రీవారి పవిత్ర లడ్డూలో కల్తీ జరిగిందని మాజీ టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఒప్పుకుంటే.. కల్తీ జరగలేదని వైసీపీ నేతలు కంత్రి వేషాలు వేస్తున్నారని దెప్పిపొడిచారు. క్రీడా స్ఫూర్తి చాటే లోకేశ్‌తో.. ప్యాలెస్‌లో పబ్జీ గేమ్ ఆడుకునే జగన్ రెడ్డికి పోలికా?' అని అప్పలనాయుడు సెటైర్లు గుప్పించారు.
వైసీపీ తీరుని సభ్య సమాజం వ్యతిరేకిస్తోంది: ఎంపీ సానా సతీశ్
శాసనమండలిలో వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరును సభ్య సమాజం వ్యతిరేకిస్తోందని టీడీపీ ఎంపీ సానా సతీశ్ పేర్కొన్నారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఫొటోలను చెప్పులు వేసుకుని ప్రదర్శిస్తున్న తీరు వైసీపీ నేతల మూర్ఖత్వానికి నిదర్శనని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు. జగన్ ఆనందం కోసమే ఆ పార్టీనేతలు ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి తప్పులు చేస్తూ వైసీపీ నేతలు కూడా పాపాలూ చేసే పరిస్థితి కొని తెచ్చుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎవరు చెప్పులు వేసుకుని రాలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఎంపీ సతీశ్ విమర్శించారు.
సభ్య సమాజమంతా వైసీపీకి బుద్ధి చెప్పే సమయం వస్తుందని సానా సతీశ్ హెచ్చరించారు. లోకేశ్ క్రికెట్ చూడటానికి వెళ్తే జగన్‌కు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. లోకేశ్‌ను చూసి జగన్ రెడ్డికి జలసీ, కుళ్లు అని ఎద్దేవా చేశారు. జగన్ ఎక్కడికైనా వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాలని విమర్శించారు. టీవీలో క్రికెట్ చూడాలని జగన్‌కు రాసిపెట్టి ఉందని.. ఆయన నేరస్థుడు కాబట్టి బయటకు వెళ్లి క్రికెట్ చూడలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఇతర దేశాళకు వెళ్లాలంటే జగన్ రెడ్డి న్యాయస్థానం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. టీటీడీ లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికి హెరిటేజ్‌కు ముడిపెట్టారని ధ్వజమెత్తారు. జగన్ అండ్ కోను దేవుడు శిక్షిస్తారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 11 మంది సభ్యులు కూడా మిగలరని సానా సతీశ్ సెటైర్లు వేశారు.
అప్పన్న ఎవరి పీఏనో అందరికీ తెలుసు: ఎంపీ ప్రభాకర్ రెడ్డి
శ్రీవారి కల్తీ లడ్డూ వ్యవహారంపై టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పన్న ఎవరి పీఏనో అందరికీ తెలుసని, ఆయనకు సహాయం చేయమని జగన్‌మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి గతంలో తనకు చెప్పారని అన్నారు. సహాయం చేసినందుకు ఆ నింద తనపై పడిందన్నారు. అప్పన్న ఎవరి పీఏనో దేశమంతా తెలుసునని ఎంపీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
Read Latest Telangana News And AP News And Telugu News