Share News

స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు: పిల్లి మాణిక్యరావు

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:45 PM

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్వేచ్ఛాపూరిత ఎన్నికలను కోరుకుంటుంటే.. వైసీపీ మాత్రం అలజడులు సృష్టిస్తోందని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. ఈ మేరకు వైసీపీ నేతలపై మండిపడ్డారు.

స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు: పిల్లి మాణిక్యరావు
pilli manikya rao local elections

గుంటూరు జిల్లా, అక్టోబర్ 23: స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలనే జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజాస్వామ్యాన్ని.. కూటమిని గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్‌కు అధికారం లేకపోయినా సరే.. తన నేరవ్యూహాలతో వ్యవస్థలను బెదిరిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని మరోసారి చంపాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.


ఎన్నికలను ఆపాలనే ఉద్దేశంతో.. రాయలసీమలో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్ది రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి కరుడుగట్టిన వైసీపీ తీవ్ర నేరస్థులు మాత్రమే అలజడులు సృష్టిస్తున్నారని మాణిక్యరావు నిందించారు. వాళ్లు ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా.. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థులకు అండగా ఉండి అభివృద్ధిని నిరాటంకంగా కొనసాగించే అవకాశాన్ని ప్రభుత్వానికి కల్పించాలని మాణిక్యరావు ప్రజలను కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...

భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 23 , 2026 | 06:00 PM