Share News

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. సీనియర్ ఐఏఎస్‌కు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం

ABN , Publish Date - Jun 14 , 2026 | 05:20 PM

ఏపీ ఆరోగ్య శాఖకు అవినీతి క్యాన్సర్ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. సీనియర్ ఐఏఎస్‌కు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం
Saurabh Gaur Transfer

అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఆరోగ్య శాఖకు అవినీతి క్యాన్సర్ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సెలవు రోజు అయినా.. ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సౌరభ్ గౌర్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)కి రిపోర్ట్ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు.


ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్‌కు అదనపు బాధ్యతలుగా అప్పగించారు. అలాగే ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీతోపాటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ కూడా సురేశ్ కుమార్‌కు బాధ్యతలు కేటాయించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మందులు, ఆస్పత్రిలో పరికరాల కొనుగోళ్ల టెండర్ల విషయంలో గోల్‌మాల్‌పై చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై నెల రోజుల క్రితమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం ఆదివారం స్పందించి కార్యదర్శి సౌరబ్ గౌర్‌పై వేటు వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం

ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 14 , 2026 | 06:09 PM