Share News

బీఈడీ కళాశాలల అధ్యాపకులకు హైకోర్టులో ఊరట.. NET/APSET అర్హతకు రెండేళ్ల గడువు

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:28 PM

ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల అధ్యాపకులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.

బీఈడీ కళాశాలల అధ్యాపకులకు హైకోర్టులో ఊరట.. NET/APSET అర్హతకు రెండేళ్ల గడువు
AP High Court

అమరావతి, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ (BEd) కళాశాలల అధ్యాపకులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) ఊరట లభించింది. ఆదికవి నన్నయ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో ఇప్పటికే నియమితులై, ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు NET/APSET అర్హత లేదనే కారణంతో వారి ధ్రువీకరణను ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఇవాళ (సోమవారం) ఈ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.


ఇప్పటికే బీఈడీ కళాశాలల్లో విధులు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న అధ్యాపకులను NET / APSET అర్హత లేదనే కారణం వల్ల అకస్మాత్తుగా తొలగించడంతో వారి జీవనోపాధిపై ప్రభావం పడుతోందని న్యాయవాది ముతుకుమల్లి శ్రీ విజయ వాదనలు వినిపించారు. ఇప్పటికే అనుబంధ బీఈడీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల అభ్యర్థిత్వాలు/ నియామకాలను ధ్రువీకరించాలని యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది.


అదేవిధంగా, సంబంధిత అధ్యాపకులు NET లేదా APSET అర్హత సాధించేందుకు రెండేళ్ల గడువు ఇస్తు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సేవలందిస్తున్న బీఈడీ అధ్యాపకుల ఉపాధికి రక్షణ కల్పిస్తూ, అదే సమయంలో NET/APSET అర్హత సాధించేందుకు అవకాశం ఇస్తు న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి

శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 01:51 PM