అమరరాజాకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Jul 16 , 2026 | 03:21 PM
తెలంగాణలో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అమరరాజాకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, జులై 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అమరరాజాకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. జగన్ హయాంలో సొంత రాష్ట్రంలో ప్రోత్సాహం దక్కాల్సిన సంస్థకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
వైసీపీ హయాంలో అమరరాజా వేధింపులకు గురైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మారిందని స్పష్టం చేశారు. అమరరాజా భవిష్యత్తు విస్తరణలో ఏపీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ‘ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి’ అంటూ గల్లా జయదేవ్‌కు మంత్రి లోకేశ్ బహిరంగ క్షమాపణ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం
తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News